ఫోర్బ్స్ జాబితాలో  విజయ్ దేవరకొండ

06 Feb,2019

అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ ని ఒక ఊపు ఊపేసి సంచలన స్టార్ గా మారిన  హీరో విజయ్ దేవరకొండకు 2019- ఫోర్బ్స్ ఇండియా ‘30 అండర్ 30‘లో చోటు దక్కింది. భారత్ లో ముప్పై సంవత్సరాల కన్నా తక్కువ వయసుకు చెందిన, ఆయా రంగాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన వారికి ఈ జాబితాలో స్థానం కల్పించారు. ఇందుకు సంబంధించిన జాబితాను ఫోర్బ్స్ ఈరోజు విడుదల చేసింది. సినీ నటుడిగా తన ప్రతిభను చాటుకున్న విజయ్ దేవరకొండ పేరు ఈ జాబితాలో చేరింది.  ఇరవై తొమ్మిదేళ్ల విజయ్ దేవరకొండ 2011లో ‘నువ్విలా’ చిత్రం ద్వారా నటుడిగా   అడుగుపెట్టాడు. 2012లో ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’లో అతిథిపాత్రలో నటించాడు. ఆ తర్వాత ‘పెళ్లి చూపులు’తో హిట్ సాధించి, ‘అర్జున్ రెడ్డి’తో సంచలన స్టార్ గా మారాడు. గత ఏడాది   ‘గీత గోవిందం’ , టాక్సీవాలా సినిమాలు  మంచి విజయాన్ని అందించాయి.   ప్రస్తుతం ‘డియర్ కామ్రేడ్’ చిత్రంలో నటిస్తున్నాడు.

Recent News